ఎన్టీఆర్ హీరోయిన్ ఛాన్స్ కోసం వెయిటింగ్!

ఒకప్పుడు హీరోయిన్స్ గా తమ సత్తా చాటిన నటీనటులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు వారి లిస్ట్ లోకి చేరబోతుంది నటి సమీరా రెడ్డి. తెలుగులో జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో ఐటమ్ సాంగ్ చేసిన తరువాత మళ్లీ కనిపించలేదు.

వివాహం చేసుకుని ఇల్లాలి పాత్రను పోషిస్తూ వస్తోన్న ఆమె, మళ్లీ ఇప్పుడు నటన పట్ల ఆసక్తిని చూపుతోంది. తెలుగు, హిందీ బాషల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. నాకు తగ్గ పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి సమీరా కోసం ఏ దర్శకులైనా.. ముందుకు వస్తారేమో.. చూడాలి!