రష్మికకు బాలీవుడ్‌ బంపర్ ఆఫర్

లక్కీ బ్యూటీ రష్మిక మందన్నకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. సంజయ్ లీలా బన్సాలి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారట. ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. బాలీవుడ్ సినిమాలో నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంజయ్ లీలా బన్సాలి నిర్మిస్తున్న ఈ సినిమాలో రణదీప్ హుడా ముఖ్య పాత్ర చేస్తున్నాడు. బల్విందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నాడు.

తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్, అఖిల్, కార్తీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది రష్మిక. గీత గోవిందం సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ కన్నడ భామ ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంటరైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలతో టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు దక్కించుకుంది రష్మిక మందన్న.