రంగమార్తాండలో బాలీవుడ్ సూపర్ స్టార్.!


టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ వంశికి ఓ మంచిపేరు ఉన్నది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. అలాంటి వంశి కొన్ని రోజులుగా సక్సెస్ రేస్ లో వెనకబడిపోయిన సంగతి తెలిసిందే. ఎలాగైనా హిట్ కొట్టాలని వంశి ట్రై చేస్తున్నాడు. నక్షత్రం సినిమాపై అసలు పెట్టుకుంటే ఆ సినిమా భారీ పరాజయం పాలైంది.

చాలా రోజులు గ్యాప్ తీసుకొని వంశి రంగమార్తాండ సినిమా చేస్తున్నాడు. మరాఠీలో సూపర్ హిట్టైన నట సామ్రాట్ సినిమాకు రీమేక్. రంగమార్తాండ రీమేక్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తుంటే, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ ఇలా ఎందరో నటిస్తున్నారు. వీరితో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఇందులో ఓ
పాత్ర చేస్తున్నారని టాక్ వస్తోంది. అలానే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. అలానే దొరసాని సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రంగమార్తాండ లిస్ట్ పెద్దగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates