పవన్‌ తాత.. బన్నీకి తండ్రి.?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. అటు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే.. మిగిలిన సినిమాలన్ని హిట్టే. ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. టాలెంట్ ఉంది అంటే.. ఆ ఆర్టిస్ట్ ని త్రివిక్రమ్ తన సినిమాల్లో రెగ్యులర్ గా వినియోగించుకుంటుంటాడు. బ్రహ్మానందం… హేమ ఇందుకు ఉదాహరణ.

త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బొమన్ ఇరాని ఓ ప్రముఖ పాత్రలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ కు తాతగా చేసిన ఈ పాత్ర చాలా కీలకమైనది. సినిమాకు మలుపునిచ్చిన పాత్ర అది. ఆ తరువాత పవన్ అజ్ఞాతవాసి సినిమాలోనూ బొమన్ చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమాలోనూ బొమన్ ఇరానీ ఓ ప్రముఖ పాత్రలో కనిపిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ కు తండ్రిగా బొమన్ కనిపించబోతున్నాడట. తండ్రి సెంటిమెంట్ తో కూడిన కథ కావడంతో.. బొమన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు తాతగా చేసిన బొమన్ ఇరాని.. అల్లు అర్జున్ కు తండ్రిగా చేస్తున్నాడు.