HomeTelugu Trendingఅంతా వట్టిదే: బోయపాటి

అంతా వట్టిదే: బోయపాటి

1 25

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంత షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈచిత్రం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్‌లు కన్ఫర్మ కాలేదు. అలాగే ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నారని, బాలయ్యకు పోటీగా ఈ సినిమాలో ఓ లేడీ విలన్‌ నటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. కరోనా మహమ్మారి అడ్డుకోకుంటే బాలయ్య సినిమా ఇప్పటికి సగం పార్ట్ పూర్తయ్యేది. ఈ సినిమాలో పాలిటిక్స్ ఉంటాయన్నదానిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వారణాసిలో షూటింగ్ చేయడం వలన బాలయ్య అఘోరాగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయని అలాంటిదేమీ లేదన్నారు. బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు. భూమిక లేడీ విలన్‌గా నటించడం లేదని, అసలు అలాంటి క్యారెక్టర్ సినిమాలో లేదన్నారు. ఈ సినిమాలో బాలయ్య పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే అంజలిని ఒక హీరోయిన్‌గా ఎంపికే చేయడం జరిగింది. డిక్టేటర్ తర్వాత బాలయ్యతో అంజలి మరోసారి జతకడుతోంది. సినిమాను భారీ బడ్జెట్‌ అంచనాలతో మొదలుపెట్టినా కరోనా కారణంగా బడ్జెట్ తగ్గించనున్నారట. బోయపాటితో జయజానకి నాయక సినిమా నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ముందుగా సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!