బాలయ్య, చిరు.. బోయపాటి ఎవరితో..?

బాలకృష్ణ ప్రస్తుతం తన 100 వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటిస్తున్నాడు. క్రిష్  దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి  కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య తన తదుపరి సినిమా కృష్ణవంశీ తో చేయాల్సివుంది. కానీ ఇప్పుడు ఆ  సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని కారణాల వలన బాలయ్య, కృష్ణవంశీ సినిమాను పక్కన పెట్టేయాలని ఫిక్స్ అయ్యాడట.  దీంతో తన తదుపరి సినిమా బోయపాటి శ్రీను తో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’,’లెజెండ్’ వంటి చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ నమ్మకంతోనే బాలయ్య,  బోయపాటికి ఫిక్స్ అయ్యాడట. అయితే చిరంజీవి 151 వ సినిమా గీతాఆర్ట్స్ లో రూపొందుతోంది. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ గా బోయపాటి పేరే  ఎక్కువగా వినిపిస్తోంది. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్ గా బోయపాటి పేరు వినిపిస్తుండడం విశేషం. మరి బోయపాటి ఈ  ఇద్దరిలో ఏ హీరోతో ముందుగా సినిమా చేస్తాడో.. చూడాలి!