HomeTelugu Newsతర్వాత మీరే.. మోడీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

తర్వాత మీరే.. మోడీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

14 9ప్రధాని నరేంద్ర మోడీ పై పాక్ సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విపక్షాలు చేతబడి, వశీకరణం వంటివి చేస్తున్నాయని, అందుకే బీజేపీ సీనియర్ నేతలు వరసగా మరణిస్తున్నారని బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. బీజేపీపై ప్రతిపక్ష పార్టీ ఏదో జాదూ చేస్తోంది. చేతబడులు, వశీకరణ ప్రదర్శిస్తోంది. అందుకే అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి బీజేపీ నేతలు ఏడాది వ్యవధిలోనే మరణించారు. తర్వాతి నెంబర్ నరేంద్ర మోడీనే అంటూ ట్వీట్ చేశారు. నజీర్ అహ్మద్ చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. నజీర్ అహ్మద్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ట్వీట్ పై కేంద్ర మంత్రి రిజుజు స్పందించారు.. ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి ఎలా వస్తారో అని చెప్పి వ్యంగాస్త్రాలు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!