డాడీ కూల్‌ అంటున్న పూరీ వారసుడు

జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నన్‌చక్స్‌లో తన తండ్రి పూరీ జగన్నాథ్‌ను అధిగమించలేనని ఆకాశ్‌ పూరీ అంటున్నారు. ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాడు. అందులో పూరీ అలవోకగా నన్‌చక్స్‌ చేస్తూ కనిపించారు. ‘నన్‌చక్స్‌లో నాన్నను నేను ఎప్పుడూ బీట్‌ చేయలేను” అంటూ డాడీ కూల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆకాశ్‌ జత చేశాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి తెగ స్పందన లభించింది. ‘వావ్, లవ్‌ యు బాస్‌, సూపర్‌ పూరీ..’ అని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.

”మెహబూబా’ తర్వాత ఆకాశ్‌ ‘రొమాంటిక్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ జగన్నాథ్ స్క్రీన్‌ ప్లే, డైలాగులు, కథ అందిస్తున్నారు. పూరీ, ఛార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. పూరీ ప్రస్తుతం రామ్‌ హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌.