HomeTelugu Trending'బ్రో' టీజర్‌ అప్డేట్‌

‘బ్రో’ టీజర్‌ అప్డేట్‌

 

Bro teaser update

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. తమిళ నటుడు,దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీజర్ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్ .

‘ఆటపట్టించడం (టీజ్) అయిపోయింది.. ఎంతో మంది ఎదురుచూసిన టీజర్ అప్‌డేట్‌ త్వరలోనే వస్తోంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. పవన్, సాయి ధరమ్ తేజ్‌లపై పోస్టర్ ని రిలీజ్ చేసింది.

తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ పాట లుక్‌లో పవన్ కళ్యాణ్‌ కనిపించాడు. ఎర్ర షర్ట్, లుంగీలో పవన్.. ప్యాంట్‌పైనే లుంగీతో సాయి ధరమ్ కనిపించారు. మరోవైపు సాయి ధరమ్ కూడా ఈ పోస్టర్‌‌ను ట్వీట్ చేశారు. త్వరలోనే టీజర్‌‌ విడుదల కానుందని చెప్పారు.

సినిమాను జులై 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సితం’గా తెరకెక్కుతుంది. తమిళంలో స్వీయ దర్శకత్వంలో నటించిన సముద్ర ఖని.. తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!