రంగ్‌ దే: బతుకు బస్టాండ్ సాంగ్‌

నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాకి యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన తొలి గీతానికి కోటికి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలోని మరో పాట వీడియో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్. పెళ్లి తరువాత నితిన్‌ కష్టాలతో ఈ పాట ఫన్నీగా సాగింది. శ్రీమణి సాహిత్యం సమకూర్చగా, గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates