HomeTelugu News'క్యాబ్ స్టోరీస్' టీజర్‌

‘క్యాబ్ స్టోరీస్’ టీజర్‌

Cab Stories teaser

ఓటీటీ వరల్డ్ లోకి వచ్చిన ‘స్పార్క్’ ఓటీటీ.. ప్రత్యేకమైన కంటెంట్ తో ఆకర్షిస్తోంది. ‘క్యాబ్ స్టోరీస్’ అనే సరికొత్త ఒరిజినల్ సిరీస్ ని స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. దీనిలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 28న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను టాలీవుడ్‌ నటులు సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేశారు.

సునీల్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ‘క్యాబ్ స్టోరీస్’ చిత్రానికి కె.వి.ఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్ కృష్ణ ‘క్యాబ్ స్టోరీస్’ ని నిర్మించారు. దీనికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu