బాహుబలిని ఎంత సీక్రెట్ గా ఉంచారో!

సినిమా తీస్తున్న దర్శకనిర్మాతలతో పాటు ఆ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులందరికీ సినిమా విషయంలో క్లారిటీ ఉంటుంది. ఎంతో నమ్మి సినిమా చేస్తారు. అయినా సరే అవతలి వ్యక్తుల అభిప్రాయాలూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో సన్నితులకు, ఇండస్ట్రీలో వారికి షో వేసి సినిమాలో ఉన్న లోటుపాట్లను తెలుసుకుంటారు. కానీ బాహుబలి2 విషయంలో ఇలాంటివేవీ జరగలేదు. ఈ సినిమాను రాజమౌళి ఎవరికీ చూపించలేదు. బయ్యర్లకు సినిమాలో ఒక్క సీన్ కూడా ఎలా
ఉంటుందో.. తెలియకుండానే కోట్లు పోసి సినిమాను కొన్నారు.

మేటర్ ఏంటంటే..? ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులు కూడా ఈ సినిమా పూర్తిగా చూడలేదు. నటీనటులకు తమ పార్ట్ వరకే సినిమా తెలుసు. రాజమౌళి, కెమెరామెన్ సెంథిల్, కీరవాణిలు తప్ప బాహుబలి2ని పూర్తి స్థాయిలో ఎవరు చూడలేదు. బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంతో పాటు సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే సినిమాను ఎవరికీ చూపించలేదు.