అమ్మకు శుభాకంక్షాలు తెలిపిన సినీ ప్రముఖులు

ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు తమ అమ్మలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ అమ్మంటే తమకు ఎంత ప్రేమనో వివరించారు.

నేను ఇప్పటివరకు పట్టుకున్న బెస్ట్‌ చేతులు మా అమ్మవే. నా పిల్లలు కూడా వారి అమ్మ చేతులు పట్టుకునే ఎదుగుతున్నారు. ఇంతకుమించి ఇంకేం కావాలి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైన మా అమ్మ, నా పిల్లల అమ్మ, ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు- మహేష్‌బాబు

అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు- మోహన్‌లాల్‌

వారి విలువను గుర్తించండి. వారి మాటలు వినండి. ఈ ప్రపంచంలోని ఎనలేని ప్రేమను వారికి పంచండి. హ్యాపీ మదర్స్‌ డే- జాన్వి కపూర్

నా జీవితంలో వండర్‌ వుమెన్‌, నా హీరో, నా బలం, నా ఆశ మా అమ్మే. హ్యాపీ మదర్స్‌ డే- సుధీర్‌బాబు

ఈ అందమైన మహిళకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నీ ప్రేమే నాకు నాపై నీకున్న నమ్మకం కూడా నిస్వార్ధమైనదే- ఛార్మి

నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నీ వల్లే నేను ఇంత ఫన్నీగా, నిబద్ధతగా, దృఢంగా ఉండగలుగుతున్నాను. నీకు బెస్ట్‌ అమ్మగా ఉంటానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఓ తల్లి నిన్ను మించిన బెస్ట్‌ కూతుర్ని కోరుకోదు. ఐ లవ్యూ యాపిల్‌. హ్యాపీ మదర్స్‌ డే టు ఆల్‌- మంచు లక్ష్మి

మా అమ్మ ఎంత అందంగా ఉందో చూశారా.. నీ అంతగా మమ్మల్ని ప్రేమించేవారు లేరు- కత్రినా కైఫ్‌

మా అమ్మ ప్రేమ ముందు ఎవ్వరి ప్రేమ సరిపోదు. ఓ తల్లి అయినప్పుడు కలిగే అనుభూతి వర్ణించడానికి మాటలు సరిపోవు. మా అమ్మ లతకు మదర్స్‌ డే శుభాకాంక్షలు- సౌందర్య రజనీకాంత్‌

ఈ ప్రపంచంలోని గొప్ప తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మమ్మల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు- కోన వెంకట్‌

ఉన్నత స్థానానికి చేరుకునేలా నన్ను పెంచావ్‌. ఇప్పుడు నువ్వు మాకు దూరంగా వెళ్లిపోయావు. ఓ నక్షత్రంలా మా వెన్నంటే ఉంటున్నావ్. హ్యాపీ మదర్స్‌ డే అమ్మా- అర్జున్‌ కపూర్‌

డియర్‌ అమ్మా.. నేను తల్లిని కావడానికి కొన్ని నిమిషాల ముందు అసలేం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. కానీ అంతా బాగానే ఉంటుందని నీకు ముందే తెలుసు. అమ్మంటే ఇలా ఉండాలని ఓ ఉదాహరణగా నిలిచినందుకు ధన్యవాదాలు. నీ పిల్లల్ని ఎలా పెంచావో నా కుమారులను కూడా అలాగే పెంచుతానని మాటిస్తున్నాను. నా చెయ్యి పట్టుకుని నాకు దారి చూపించు- జెనీలియా

నాకు బెస్ట్‌ అమ్మ దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను- రకుల్‌ ప్రీత్‌సింగ్‌

హ్యాపీ మదర్స్‌ డే అమ్మా. నీ నవ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను మరింత నవ్వించాలనుకుంటున్నాను- కృతి సనన్‌‌