శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. ఇప్పటికే రాక్ బ్యాండ్ వంటివి పెట్టి తనలోని గాయనిని కూడా పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాల్లో కూడా పాటలు పాడుతుంటుంది. కమల్ హాసన్ నటించిన ఈనాడు సినిమాకు సంగీత దర్శకురాలిగా కూడా పని చేసింది. సినిమాల్లోకి రాకముందే శృతిహాసన్ గాయకురాలిగా పేరు తెచ్చుకుంది. తాజాగా తమన్నా కొత్త చిత్రం ‘ఖామోషి’లో ఒక పాటను శృతి హాసన్ ఆలపించిందట. అదే సినిమా టైటిల్ సాంగ్. ఈ పాటకు శ్రోతల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలచేయబోతున్నారు. ఇందులో ప్రభుదేవా విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది శృతి హాసన్. రెండేళ్లుగా సినిమాలు ఏమీ ఒప్పుకోవడం లేదు. పూర్తిగా నటన మానేసి సంగీతం వైపు అడుగులేస్తుంది. ఒకప్పుడుసినిమాలు మానేసి రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాలని అనుకుందట శృతి హాసన్. దీనికోసం టీమ్‌ను సిద్ధం చేసుకుని స్టేజ్ షోలు కూడా ఇవ్వడానికి కూడా రెడీ అయిందట. ఆ మధ్య విదేశీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసిందట. కాటమరాయుడు తర్వాత తెలుగులో ఈమె మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. రెండేళ్ల కింద వచ్చిన బెహన్ హోగా తేరీ తర్వాత శృతి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నా కూడా అది కూడా కుదర్లేదు.