
సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి నేడు. 70 ఎంఎం, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్ కలర్, డీటీఎస్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన అరుదైన ఘనత కృష్ణ సొంతం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా సేవలందించాడు.
కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్, నరేశ్, ఆదిశేషగిరిరావుతోపాటు రఘురామ కృష్ణంరాజు, అశోక్ గల్లా, భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ప్రథమ వర్థంతిన సూపర్ స్టార్‌కు నివాళులర్పించి ఆయన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు.
కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు కృష్ణ. నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ ద్వారా సక్సెస్ పుల్ చిత్రాలను నిర్మించారు. కౌబాయ్, స్పై (గూడఛారి) జోనర్ సినిమాలను చేసిన తొలి తెలుగు నటుడిగా అరుదైన రికార్డు కృష్ణ పేరుపైనే ఉంది.












