HomeTelugu Trendingఏపీ రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదన్న బీజేపీ నేత

ఏపీ రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదన్న బీజేపీ నేత

12 15

ఏపీరాజధానిపై బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ 13 రోజులుగా రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. నిన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ రాజధానిని మారిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. ఇప్పటికే కేంద్రం పెద్దలతో మాట్లాడానని, కేంద్రం సమయం చూసి స్పందిస్తుందని అన్నారు. దానికి కౌంటర్‌గా నేడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సుజనా వ్యాఖ్యలపై ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.

ఏపీ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో పెట్టాలని కేంద్రం సూచించలేదు అలాగే రాజధానిని మార్చాలని కూడా కేంద్రం చెప్పలేదని అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సూచనలు చేస్తుందని తెలిపారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఈ విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నామని అన్నారు. బీజేపీ అధికారికంగా చెబుతున్న మాట అని
తెలిపారు. రాజధానిపై కేంద్రం తరపున ఎవరు ఎన్ని చెప్పినా నేను చెప్పేదే పార్టీ విధానమని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధానిపై కేంద్రం జోక్యం విషయంలో ఎవరు ఏమి చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. నేను జాతీయ అధికార ప్రతినిధిగా చెబుతున్నానని.. బీజేపీ రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు రాజధానిపై చేసిన వ్యాఖ్యలు అది వారి వ్యక్తిగతం మాత్రమేనని స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu