HomeTelugu Big Storiesనిత్యావసరాల కోసం రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి

నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి

13 17

కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళనకరమని అన్నారు. కరోనా గురించి అనేకమంది నిపుణులతో చర్చించానని, కరోనా పాజిటివ్‌ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు. తరచూ వేడి నీరు పుక్కిలించాలన్నారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రాణాయామం, యోగా, వ్యాయామం, ఎండలో ఉండటం లాంటివి చేయాలని కోరారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలన్నారు. సీ-విటమిన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇటలీలో వైద్యులు సైతం చనిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. నిత్యావసరాల కోసం అందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ల ద్వారా రేషన్ ఇంటికే పంపించాలని కోరారు. పింఛన్లు కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలన్నారు. వైద్యం విషయంలో అమెరికా, ఇటలీ లాంటి దేశాలే చేతులెత్తేశాయి. ఒక స్థాయి దాటితే మనదేశంలోనూ వైద్యం అందించలేం. అందువల్ల ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం అని చంద్రబాబు వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!