రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

గోరుకల్లు జలాశయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘అవుకు టన్నెల్‌ పూర్తి చేసి రికార్డు సృష్టించాం. అవుకు బైపాస్‌ టన్నెల్‌ ద్వారా రోజు టీఎంసీ పంపుతున్నాం. ఈ ఏడాది రాయలసీమకు 200 టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. గోరుకల్లు జలాశయానికి రూ.590 కోట్లు ఖర్చు పెట్టాం. చరిత్రలో మూడు ప్రాజెక్టులు ఒకే రోజు ప్రారంభించాం. ముచ్చుమర్రి రాయలసీమకు గుండె వంటిది. రాష్ట్రానికి రూ.15 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రకృతి సేద్యంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం.

ప్రతి ఎకరాకు సాగునీరందించి రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, రతనాల సీమగా మార్చే వరకూ అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. అక్టోబరు 2 నుంచి యువనేస్తం కింద రూ.వెయ్యి పింఛను ఇవ్వనున్నాం’ అని చంద్రబాబు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి, ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.