అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు స్పందన

బాబ్లీ వివాదంలో అరెస్ట్ వారెంట్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాను నేరాలు, ఘారాలు చేయలేదని, ఎక్కడా అన్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు పైన ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని, కట్టడానికి వీల్లేదని ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని ఆరోజు నిరసన తెలిపేందుకు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర సరిహద్దులోనే పోలీసులు మమ్మల్ని అడ్డుకుని అరెస్ట్ చేశారని, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారని చంద్రబాబు అన్నారు. మేము తప్పు చేయలేదు, మీ పోలీసులు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేశారని, మీరేం చేస్తారో చేయాలని ఆనాడే నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తిని నేనంటూ చంద్రబాబు ఆవేదన వెల్లడించారు.

ఆనాడు మాపై కేసులు పెట్టామని, పెట్టలేదని బలవంతంగా ప్రత్యేక విమానంలో మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో వదిలారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు నోటీసులు పంపామని మాట్లాడుతున్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చామని మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చామని మాట్లాడే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ పూర్తిగా దెబ్బభయపడేవారు లేరని చంద్రబాబు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పని చేసినా ప్రజల కోసమే చేశానన్నారు. కేసులు, నోటీసులతో మమ్మల్ని ఏమీ చేయలేరంటూ తేల్చి చెప్పారు. అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.