పారితోషికం పెంచేసిన నవీన్‌ పోలిశెట్టి

టాలీవుడ్‌లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఆయన జాతకం మారిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేయడమే గాక ఓవర్సీస్ లో విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు, చాలా మంది నిర్మాతలు నవీన్ కోసం భారీ పారితోషికం చెల్లించేందుకు అడ్వాన్సులు కూడా ఇవ్వాలని చూస్తున్నారట. ఒక నిర్మాత భారీ పారితోషికం ఇచ్చేందుకు ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్ యాక్టింగ్ లో కొత్తదనంతో పాటుగా సినిమా ప్రమోషన్ చేసుకొనే విధానానికి ఆ నిర్మాత ఫిదా అయ్యాడట. దీంతో ఆయనకు 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధగా ఉన్నాడనే ప్రచారం టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే నవీన్ ఇప్పటివరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు.

CLICK HERE!! For the aha Latest Updates