చరణ్ లుక్ ఫైనల్ చేశారు!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. దానికి కారణం కథ, కథనాల ప్రకారం హీరో లుక్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే.. ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజంట్ చేయడం సుకుమార్ ప్రత్యేకత. ఆర్య నుండి నాన్నకు ప్రేమతో వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో హీరో కొత్తగా కనిపిస్తాడు. వారిపై సుకుమార్ అంతగా దృష్టి పెడతాడు. ఇప్పుడు చరణ్ విషయంలోనూ అదే జరుగుతోంది.

ఈ సినిమాలో చరణ్ ను పల్లెటూరి బుల్లోడుగా చూపించనున్నాడు. దీనికోసం చరణ్ పై ఏకంగా 15 స్క్రీన్ టెస్టులు చేసాదట సుకుమార్. సుకుమార్ చెప్పినట్లుగా ప్రస్తుతం చరణ్ తన కండల్ని కరిగించే పనిలో ఉన్నాడు. గుబురు గడ్డం కూడా పెంచేశాడు. ఫైనల్ గా చరణ్ లుక్ ను సుకుమార్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకునే అవకాశం ఉంది.