చరణ్ తోడళ్ళుడు కానున్న శర్వా!

రామ్ చరణ్, శర్వానంద్ నిజజీవితంలో మంచి స్నేహితులు. త్వరలోనే వీరిద్దరికీ బంధుత్వం కూడా కలవబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. వరుస విజయాలతో సక్సెస్ బాటలో నడుస్తోన్న శర్వానంద్ ప్రస్తుతం శతమనం భవతి సినిమాలో నటిస్తున్నాడు.
అతి త్వరలోనే ఈ యువహీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు చరణ్ భార్య ఉపాసనకు స్వయంగా కజిన్ సిస్టర్. ఈమెనే శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
 
ఇప్పటికే వీరి పెళ్లి విషయంపై ఇరు కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ వార్తలు నిజమైతే రామ్ చరణ్ కు వరుసకు శర్వా తోడళ్ళుడు అవుతాడు.
 
రియల్ లైఫ్ లో శర్వాను గానీ, చరణ్ ను గానీ మీ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే వెంటనే ఒకరిపేరు మరొకరు చెబుతారు. అటువంటి వీరిద్దరు తోడల్లుళ్ళు కాబోతుండడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here