‘అభిమన్యు నారాయణ’ పేరు బావుంది చరణ్!

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు. 1980లలో జరిగే ప్రేమకథ నేపధ్యంలో ఈ సినిమా నడవనుంది. అయితే కొద్దిరోజుల క్రితం వరకు ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉండేది. ఇటీవల దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. గుబురు గడ్డంతో, గల్ల లుంగీతో కనిపించాడు చరణ్. ఇప్పుడు అతడి పాత్ర పేరు అభిమన్యు నారాయణ అంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది.

రంగస్థల నటుడిగా ఆయన అభిమన్యు పాత్రలో కనిపిస్తాడని టాక్. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. సమంత ఈ సినిమాలో సంపన్న కుటుంబానికి చెందిన పల్లెటూరి యువతిగా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.