పూరీ ఐటెమ్ బ్యూటీ ఆమెనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న కమర్షియల్ సినిమాలకు ఐటెమ్ సాంగ్ అనేది పక్కగా ఉండాల్సిందే.అందులోనూ పూరీజగన్నాథ్ సినిమా అంటే ఐటెమ్ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. తాజాగా పూరీ, బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ అన్నింటి కంటే ముందే ఉంటుందట. సినిమా ఓపెనింగ్ సన్నివేశాలు పబ్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఐటెమ్ సాంగ్ తో ఉంటుందని సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేస్తున్నారు.
మిగిలిన సినిమాల్లో ఐటెమ్ సాంగ్ మధ్యలో వస్తుంది కానీ పూరీ సినిమా కదా..  కాస్త స్పెషల్ ఎఫెక్ట్ కోసం స్టార్టింగ్ లోనే స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేశాడు. ఇప్పటికే విదేశాల్లో మూడు పాటలను చిత్రీకరించారు. ఈ ఐటెమ్ సాంగ్ మాత్రం ఇక్కడే భారీ సెట్ వేసి చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటలో నటించే భామ ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త అమ్మాయిని తీసుకు వస్తారనే మాటలతో పాటు… ఛార్మీ కూడా ఈ పాటలో నటించే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. మరి పూరీ తన ఓటు కొత్త అమ్మాయికో, లేక ఛార్మీకు వేస్తాడో.. చూడాలి!
 
 
Attachments