పొగరు నా ఒంట్లో.. హీరోయిజం నా ఇంట్లో!

పొగరు నా ఒంట్లో.. హీరోయిజం నా ఇంట్లో!
కమర్షియల్ సినిమాల్లో మాస్ డైలాగ్స్ కచ్చితంగా ఉండాలి. అప్పుడే థియేటర్ లో ఆడియన్స్ ఎంజాయ్ 
చేస్తారు. పైగా అది మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తోన్న అంటే.. డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉండాలి. ఆ విషయాలన్నీ 
దృష్టిలో పెట్టుకొనే వినాయక్ డైలాగ్స్ రాసుకున్నట్లు ఉన్నాడు. నిన్న మెగాస్టార్ పుట్టినరోజు 
వేడుకలను శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ రాకపోవడం, రిలీజ్ 
చేసిన టీజర్ లో డైలాగ్స్ లేకపోవడంతో మెగాభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. వారిని ఊరట 
పరచాలనే ఉద్దేశ్యంతో వినాయక్, చిరంజీవి సినిమాలో చెప్పే డైలాగ్ ఒకటి స్టేజ్ మీద చెప్పారు. ఈ 
సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”చిరంజీవి గారి నుండి అభిమానులు ఏం కోరుకుంటారో.. 
అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇక డైలాగ్స్ అయితే చెప్పనక్కర్లేదు.. మీకోసం ఒక డైలాగ్ 
చెబుతానంటూ.. ‘పొగరు నా ఒంట్లో ఉంటుంది… హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది’ అని చెప్పగానే 
ఆడియన్స్ ఈలలు, గోలలు చేసి ఎంజాయ్ చేశారు. ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయని 
వినాయక్ స్పష్టం చేశారు.  
CLICK HERE!! For the aha Latest Updates