HomeTelugu Trendingచిరంజీవి 153వ చిత్రానికి దర్శకుడు ఇతడే..!

చిరంజీవి 153వ చిత్రానికి దర్శకుడు ఇతడే..!

11 22
మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత తాజా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మెగాస్టార్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్ ప్రకటించడంతో చిరంజీవి తర్వాతి సినిమాపై తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.

చిరంజీవి 153వ సినిమా దర్శకుడు సుకుమార్‌తో చేయడానికి ఒపుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు రంగస్థలం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ప్రస్తుతం కొరటాలతో చేస్తున్న చిరంజీవి సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!