ఆచార్య నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తుంది!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. ఈ రోజు రామ్‌ చరణ్‌ పుట్టినరోజున సందర్భంగా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ…. ‘లాహి లాహి… అనే ఫస్ట్ సింగిల్ ను మార్చి 31వ తేదీ సాయంత్రం 4.05 నిముషాలకు విడుదల చేస్తున్నాం. మీకు ప్రామిస్ చేసినట్లుగానే వింటేజ్ మెగాస్టార్ ని మీ ముందు ఉంచుతున్నాం’ అని అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ‘ఆచార్య’ సినినమాలో నాగర్జున, చరణ్‌ ‘కామ్రేడ్ సిద్ధా’ను పరిచయం చేసిన యూనిట్ సాయంత్రం కొత్త అప్ డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేసింది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates