HomeTelugu Trending'ఆచార్య' వాయిదా ప్రకటించిన మూవీ యూనిట్‌

‘ఆచార్య’ వాయిదా ప్రకటించిన మూవీ యూనిట్‌

Acharya movie postponedమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొర‌టాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడింది. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాను మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ఇదివరకే ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అందరూ మాస్కులు ధరించండి, సురక్షితంగా ఇంట్లోనే ఉండండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్‌కు జంటగా పూజా హెగ్డే నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu