
నేడు పద్మశ్రీ కె.విశ్వనాథ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా చిరు పోస్ట్ చేస్తూ.. ‘గురుతుల్యులు, పితృసమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం, తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
గురుతుల్యులు,
పితృసమానులు,మహోన్నత దర్శకులు,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంచేసిన
కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం,తెలుగు వారికి చిరస్మరణీయం.ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను pic.twitter.com/QarX4hCGp4— Chiranjeevi Konidela (@KChiruTweets) February 19, 2021













