చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి కొత్తగా విద్యారంగంలోకి అడుగుపెట్టారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. తక్కువ ఫీజులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారట. మొదట శ్రీకాకుళం జిల్లాలో మొదలుకానున్న ఈ పాఠశాలలు త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు విస్తరించనున్నాయి. రామ్ చరణ్, నాగబాబు ప్రస్తుతం వీటి బాధ్యతల్ని చూస్తున్నారు. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ పాఠశాలల్లో మెగా అభిమానుల పిల్లలకు ఫీజుల్లో రాయితీలు కల్పించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates