అభిమానులకు చిరు విషెస్!

తెలుగు ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. పెద్ద స్టార్ల సినిమాలు, న‌వ‌త‌రం హీరోల సినిమాలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు వ‌స్తున్నాయి. 2017 అంద‌రికీ క‌లిసి రావాల‌ని, స‌క్సెస్‌ని ఇవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సంవ‌త్స‌రం నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ `ఖైదీనంబ‌ర్ 150`చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఇది ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూవ్‌మెంట్‌. సంక్రాంతికి మీరంద‌రూ మెచ్చే సినిమాగా వ‌స్తోంది. నా సినిమాతో పాటు, మ‌రిన్ని మంచి సినిమాలు సంక్రాంతికి రిలీజ‌వుతున్నాయి. అంద‌రికీ విజ‌యం చేకూరాల‌ని ఆకాంక్షిస్తున్నాను. థాంక్యూ…
– మీ చిరంజీవి