మల్టీస్టారర్ కోసం చిరు, పవన్ ల రెమ్యూనరేషన్!

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటంటే మెగామల్టీస్టారర్. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను ఒకే తెరపై చూస్తామని మెగాభిమానులు కూడా ఊహించి ఉండరు. కానీ ఈ కాంబో అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలిసిన తరువాత వారి ఆనందానికి అవధుల్లేవు. త్రివిక్రమ్
ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

తాజాగా ఈ సినిమా ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే విషయం బయటకు వచ్చింది.  మెగాస్టార్ కు, పవన్ కల్యాణ్ కు పాతిక కోట్ల చొప్పున పారితోషికం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కు కనీసం 15 కోట్లు అయినా.. ఇవ్వాలని భావిస్తున్నారు. కేవలం పారితోషికాల విషయంలో 65 కోట్లు దాటేస్తే ఇక సినిమాను ఎంత బడ్జెట్ లో నిర్మించబోతున్నారో అని చర్చించుకుంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates