ఉయ్యాలవాడ హిస్టరీ లండన్ లో!

చిరంజీవి 151వ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా పూర్తి చారిత్రాత్మక నేపధ్యంతో కూడిన కథ కావడంతో దానికి సంబంధించిన చరిత్రపై పరిశోధన జరుపుతున్నారు. ఆ కాలం నాటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సంపాదించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చారిత్రక ఆధారాల కోసం రాయలసీమ వెళ్ళిన చిత్రబృందం.. అక్కడ కొంత సమాచారాన్ని సేకరించింది. అలానే లండన్ లో నేచురల్ హిస్టరీ మ్యూజియం దక్షిణ భారత విభాగంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని బట్టి పూర్తి కథను సిద్ధం చేస్తున్నారట. సినిమా విడుదలయిన తరువాత ఎటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.