భారత్, పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మీ

మాంచెస్టర్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సినీ నటి మంచు లక్ష్మీ సందడి చేశారు. త్రివర్ణ పతకాన్ని చేతపట్టుకుని కోహ్లీ సేనకు మద్దతు తెలుపుతున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రపంచకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లకు హాజరువుతున్న టాలీవుడ్, బాలీవుడ్ నటుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు హజరయ్యారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు సందడి చేసిన విషయం తెలిసిందే.