ఆరోవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు – అభివృద్ధిపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఇవాళ మానవవనరుల అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మానవ వనరులు సరిగా వినియోగించుకుంటేనే సమాజ ప్రగతి కుంటుపడుతుందని… మానవవనరుల విలువను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. లక్షా 31 వేల కోట్లు విద్య, వైద్యం, చైల్డ్ వెల్ఫేర్ కి ఖర్చు పెట్టామని వెల్లడించిన చంద్రబాబు.. పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. విద్యాశాఖలో జాతీయస్థాయిలో ఉన్నత ప్రమాణాలు సాధించాం.. ఇతర దేశాల విద్యాసంస్థలతో ఎంఓయూలు చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. వైద్య శాఖలో 24 సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపిన సీఎం… పుట్టే బిడ్డ నుంచి మహా ప్రస్థానం వరకు పథకాలు అందింస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి… ఆస్పత్రిలో మెరుగైన సేవల కారణంగా 51 శాతం రోగులు రాక పెరిగిందన్నారు.