HomeTelugu Trendingకోబ్రా: కొత్త ట్రైలర్‌ విడుదల

కోబ్రా: కొత్త ట్రైలర్‌ విడుదల

Cobra movie Trailer

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రం ‘కోబ్రా’. సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ క్రిందికి ఈ సినిమా వస్తుంది. విక్రమ్ ఇంతవరకూ చేస్తూ వచ్చిన డిఫరెంట్ రోల్స్ లో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారనే విషయం అర్థమవుతోంది. దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరిగిందనే విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఇర్ఫాన్ పఠాన్.. మియా జార్జ్.. మృణాలిని రవి .. కనిక కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu