HomeTelugu Trendingసోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగమ్మాయి

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగమ్మాయి

Tejaswi Madivada new

నటి తేజస్వి మదివాడ అంటే ఇప్పుడు కుర్రకారుకి బాగా తెలిసిన పేరు. మొదట్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్ అయ్యింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి హాట్ బ్యూటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తేజస్వి తన ఫొటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంట్లో ఉంటూ హాట్ ఫొటో షూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయలేరనే వారికి తేజస్వి బలమైన కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉంది. త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌లో కనిపించబోతుందట. ఇండస్ట్రీలో ఉండే కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu