HomeTelugu Trending'రౌడీబేబి' సాంగ్‌పై వివాదం

‘రౌడీబేబి’ సాంగ్‌పై వివాదం

controversy on maari 2 ro
కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘మారి2’ సినిమాలో రౌడీబేబి సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హోల్ ఇండియాలోనే యూట్యూబ్‌లో ఓ పాట సోలోగా వంద కోట్ల (1 బిలియన్) వ్యూస్ రాబట్టిన పాటగా ఈ పాట రికార్డులు క్రియేట్ చేసింది. సాయి పల్లవి లేదు. ఈ పాటకు ధనుష్‌, సాయి పల్లవిల డాన్స్ మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ పాటలో సాయి పల్లవి డాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులను ఫిదా చేసింది. సాయి పల్లవి హైలెట్‌గా నిలిచింది. ఈ పాట తర్వాత సాయి పల్లవిని అందరు రౌడీ బేబి అని పిలుస్తున్నారు. ఈ ఘనట సాధించిన సౌత్ ఇండియా పాటగా రౌడీ బేబి సాంగ్ ఘనతను చెబుతూ.. మూవీ యూనిట్ వండర్ బార్ ఓ కామన్ డీపికి విడుదల చేసింది. అందులో కేవలం ధనుశ్ మాత్రమే ఉన్నాడు. ఈ డీపిలో సాయి పల్లవి లేకపోవడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా వండర్ బార్ చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. ధనుశ్‌కి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం, పాట పాడిన ‘థీ’ పేరు మెన్షన్ చేయకపోవడం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!