HomeTelugu Trendingబాలయ్యకు తప్పని కరోనా కష్టాలు..

బాలయ్యకు తప్పని కరోనా కష్టాలు..

1 21

కరోనా మహ్మమారి ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. ముఖ్యంగా సినిమా రంగం పైన దాని ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ తో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీల సినిమాలు షూటింగ్ లు వాయిదా పడిపోయాయి. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలు లాక్‌డౌన్ ఆగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఇప్పడప్పుడే తెరుచుకునేలా పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇక టాలీవుడ్‌ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో సినిమా కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి.

అయితే కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వారణాసిలో ఎక్కువ శాతం షూటింగ్‌ జరుపబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా లాక్‌డౌన్ తర్వాత కూడా అక్కడ షూటింగ్ కు అనుమతించే అవకాశం కనిపించడం లేదు. దాంతో చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారని తెలుస్తుంది. వారణాసిలో చిత్రీకరణ కోసం అప్పటి వరకు బోయపాటి ఎదురు చూస్తాడా లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ ను పూర్తి చేస్తాడా అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!