టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆఫీసులో కరోనా క‌ల‌క‌లం.!

దేశంలో కరోనా విజృంభిస్తుంది. హైద‌రాబాద్‌లో కూడా ఇంచుమించు పరిస్థితి అలానే ఉంది. సామాన్య ప్రజల నుండి సెల‌బ్రిటీల‌ని, పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ఇటీవలే టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు క‌రోనా వైరస్ సోక‌డంతో టాలీవుడ్ వ‌ర్గాలు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఓ ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత క‌మ్ డిస్ట్రీబ్యూట‌ర్‌ సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు తెలుస్తోంది. మీడియాలో దీనికి సంబంధించి వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. విష‌యం తెలిసిన వెంట‌నే స‌ద‌రు నిర్మాత త‌న ఆఫీస్ కార్యాల‌యాన్ని మూసివేసిన‌ట్టు చెబుతున్నారు. ఈ విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో స‌మీపంలో వున్న సినిమా ఆఫీసుల‌న్నీ మూసేశార‌ట‌.

తాజా సంఘ‌ట‌న‌తో నిర్మాత‌లంతా ఎల‌ర్ట్ అయ్యార‌ని, సినిమా షూటింగ్‌లు జ‌ర‌గ‌ని ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఆఫీసులు తెర‌వ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించి ఆఫీసుల‌కు తాళాలు వేసిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ వైర‌స్ ఏ నిర్మాత సిబ్బందికి సోకింది?. ఆ సిబ్బంది ప‌రిస్థితి ఏంట‌నేది మాత్రం ఇంత వ‌ర‌కు తెలియ‌రాలేదు.

CLICK HERE!! For the aha Latest Updates