పవన్ సినిమాలో ఉదయభాను!

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లు జంటగా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ లో ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కనిపించబోతుందని టాక్. ఈ స్పెషల్ సాంగ్ విషయమై ఇప్పటికే త్రివిక్రమ్ ఆమెను సంప్రదించడం దానికి ఉదయభాను అంగీకరించడం జరిగిపోయాయని సమాచారం. ఉదయభానుకి ఐటెమ్ సాంగ్స్ లో నటించడం ఇది మొదటిసారి కాదు.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లీడర్’ సినిమాలో కూడా ఆమె ఐటెమ్ సాంగ్ లో మెరిసింది. ఇప్పుడు మరోసారి పవన్ తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడానికి రెడీ అయిపోయింది. చాలా కాలంగా టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ భామ మళ్ళీ యాంకర్ గా బిజీ కావాలనుకుంటోంది. త్వరలోనే ‘నీతోనే డాన్స్’ అనే రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది.