‘డియర్‌ కామ్రేడ్’ ట్రైలర్‌ వచ్చేసింది

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్’. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది?’ అంటూ విజయ్‌ బాధపడుతూ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. రష్మిక గురించి ఆమె స్నేహితులకు ఫిర్యాదు చేస్తూ.. ‘కైసీ కర్తీ ఇస్సే దోస్తీ.. చాలా కష్ట్‌ హై’ అంటూ వచ్చీ రాని భాషలో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తు్న్న ఈ చిత్రం జులై 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.