
బాలీవుడ్ హీరోయిన్ కంగనకు ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు. వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం పంగ సినిమా చేస్తున్న కంగన … దేశంలో జరుగుతున్న అల్లర్లపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిరసనలు అన్నవి శాంతియుతంగా జరగాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఒక్కో బస్సు ఖరీదు రూ. 80 లక్షల వరకు ఉంటుందని, ఈ బస్సులను పబ్లిక్ కట్టిన పన్నులతో కొంటారని, కేవలం దేశం మూడు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే పన్నులు కడుతున్నారని అన్నది.
దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. దేశంలో సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో పన్నుకు కడుతున్నారని, ఇలా మాట్లాడటం తగదని అయన కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ కు మరి కంగనా ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.













