
Kuberaa Collections:
ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన “కుబేరా” మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేస్తున్నారు. స్క్రిప్ట్, బీజీ ఎమోషన్స్, నటనలకు మంచి ప్రశంసలే వచ్చాయి.
కానీ ఆశ్చర్యంగా తమిళనాడు ప్రేక్షకులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇది అంతా ఆశించినదే కాదు, ఎందుకంటే ధనుష్ కాంబినేషన్‌తో వస్తే తమిళనాట అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్‌ఫుల్స్ హల్చల్ జరుగాలి. కానీ ఇక్కడ పరిస్థితి తక్కువగా కనిపిస్తోంది.
తమిళనాడు రిస్పాన్స్ పాడవడానికి కారణాలు ఏమై ఉండచ్చంటే..
1. శేఖర్ కమ్ముల పేరు అక్కడ పెద్దగా గుర్తింపు లేదు
2. ధనుష్ ఇలాంటి కథల్లో మునుపటినుంచి కనిపించడంతో, ఈ సినిమా కొత్తగా అనిపించలేదు
3. స్క్రీన్‌ప్లే లో కొంత “కన్వినియన్స్” ఎక్కువైందనే అభిప్రాయం
4. ఫైనాన్షియల్ ఫ్రాడ్ లాంటి ప్రధాన అంశాన్ని లోతుగా చూపించకపోవడం
5. ఎండింగ్ సడన్‌గా వచ్చేసి అంతగా క్లారిటీ ఇవ్వకపోవడం
ఈ అన్ని కారణాలతో కలిపి, తమిళ తంబీలు ఈ సినిమాను ఓ సరికొత్త అనుభవంగా చూడలేకపోయారని విశ్లేషణ. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ధనుష్ కొత్తగా కనిపించడం, శేఖర్ మాక్ స్టైల్ అనిపించడంతో, వర్కౌట్ అయ్యింది.
ఇది వన్ సైడ్ ట్రెండ్ కాదని, ఓవర్ టైం తమిళనాడులో కూడా అప్‌పిక్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ఇప్పుడు ఫోకస్ తెలుగు బాక్సాఫీస్ పై ఉంది.













