ఓ అమ్మాయికి ఎంగేజ్మెంట్ రింగుతో ప్రపోజ్‌ చేసిన దేవరకొండ!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఓ అమ్మాయికి ఉంగరంతో ప్రపోజ్‌ చేశారు. ఓ ఆల్బమ్‌ కోసం.. విజయ్‌ ‘నీ వెనకాలే నడిచి..’ అనే పాటలో నటించారు. ఆయన ప్రేయసిగా మలోబికా బెనర్జీ కనిపించారు. తాజాగా విడుదల చేసిన ఈ పాట చాలా బాగుందని అక్కినేని నాగచైతన్య ట్వీట్‌ చేశారు. ‘భానుశ్రీ తేజ పాటను అందంగా తెరకెక్కించారు. ‘నీ వెనకాలే నడిచా..’ సూపర్‌గా ఉంది’ అని పేర్కొన్నారు.

ఈ పాట ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో విజయ్‌ ఉంగరంతో మోకాలిపై కూర్చుని మలోబికాకు ప్రపోజ్‌ చేశారు. ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆలపించారు. అనంత్‌ శ్రీరామ్‌ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 7 లక్షల మందికిపైగా చూశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఐదో స్థానంలో ఉంది.