‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన హీరో!

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా హిందీ హక్కుల్ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్‌కు బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ అనుకున్నారట. సినిమా కోసం షాహిద్‌ రూ.40 కోట్లు పారితోషికంగా అడిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌లోనే నటించనని షాహిద్‌ అన్నారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో షాహిద్‌ నటించారు. ఇప్పుడు ‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్‌ చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates