HomeTelugu Trending'ముఖ్యమంత్రి సహాయ నిధి'కి దిల్‌ రాజ్‌ విరాళం

‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి దిల్‌ రాజ్‌ విరాళం

7 9

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ఈ నేపద్యంలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పేద ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయి. వలస కార్మికులు, రోజూవారి కూలీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పనులు లేక వారు ఇళ్లకే పరిమితం కావడంతో పూట గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారిని ఆదుకోవడానికి కొందరు పెద్దమనసుతో ముందుకు వస్తున్నారు తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ తన వంతు సాయం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ. 10 లక్షల విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, ఈ రోజు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిసి రూ. 10 లక్షల చెక్ అందజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu