కార్తితో తేజ‌ త‌మిళ‌ చిత్రం!

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఫ్లాప్ డైరెక్ట‌ర్‌గా ముద్ర వేయించుకున్న తేజ అనూహ్యంగా ఒకే ఒక్క హిట్టుతో లైమ్‌లైట్‌లోకొచ్చాడు. రానా క‌థానాయ‌కుడిగా ‘నేనే రాజు నేనే మంత్రి’ ఘ‌నవిజ‌యం సాధించ‌డంతో తేజ‌కు మ‌రోసారి డిమాండ్ పెరిగింద‌ని చెబుతున్నారు. ఒక్క హిట్టు డిసైడ్ చేస్తుందిక్క‌డ‌. ఆ ఒక్క హిట్టుతో అత‌డు ఓ స్టార్ హీరోని, ఓ యువ‌హీరోని డైరెక్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ని  వార్త‌లొచ్చాయి. వ‌రుణ్‌తేజ్ – సాయిధ‌ర‌మ్‌ల‌ను క‌లిపి ఓ మెగా మల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్నాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. 
 
అయితే ఈ ప్ర‌చారం మాటెలా ఉన్నా.. నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసిన కార్తీ ఆ సినిమా టేకింగ్‌కి  ఫిదా అయిపోయాడుట‌. అదే సినిమాని త‌మిళ పాలిటిక్స్‌కి అనుగుణంగా మార్చి త‌న‌తో సినిమా చేయాల్సిందిగా తేజ‌ను కార్తీ కోరాడుట‌. ఆఫ‌ర్ బావుంది.. అయితే తేజ అంగీక‌రించారా?  లేదా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.