సంచలన దర్శకుడితో శర్వా..?

ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్ తాజాగా ఓ సంచలన దర్శకుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా….ఆమధ్య క్రైమ్ జోనర్ లో వచ్చిన సినిమాల్లో సంచలనం రేపిన సినిమా దండుపాళ్యం. రియల్ సంఘటనల నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు శ్రీనివాస రాజు. తాజాగా ఈ దర్శకుడు కమర్షియల్ అంశాలతో మంచి సినిమా చేయాలనీ హీరో శర్వానంద్ తో కథ చర్చలు జరిపాడట. కథ నచ్చడంతో శ్రీనివాసరాజు తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట.

ఇంతవరకు ఆ జోనర్ లో సినిమా రాలేదని భావించిన శర్వా ఆయనతో సినిమాకి ఓకే అన్నాడని టాక్. ప్రస్తుతం శర్వానంద్, హను రాఘవపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు సుధీర్ వర్మతో ఓ సినిమా లైన్ లో ఉంది కాబట్టి .. దండుపాళ్యం దర్శకుడితో తెరకెక్కే సినిమా ఈ రెండు చిత్రాల తరువాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.