HomeTelugu Newsఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

6 9

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన ట్విట్టర్‌లో భావోద్వేగభరితంగా ఓ పోస్ట్ చేశాడు. 2012, ఫిబ్రవరి 10న ఆయన పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి సినిమా ‘ఎస్‌ఎమ్‌ఎస్‌-శివ మనసులో శ్రుతి’ విడుదలైంది. ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘వీ’ సినిమాలో నటిస్తున్నాడు చిత్రంలో నాని మరో కీలక పాత్ర చేస్తున్నాడు.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సుధీర్ బాబు స్పందిస్తూ.. ‘ఇదే రోజు.. ఎనిమిదేళ్ల క్రితం… ఎస్‌ఎమ్‌ఎస్‌ విడుదలైంది. ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని, సినిమాపై మరింత ప్రేమ పెంచుకోవాలని భావిస్తున్నాను’ అని సుధీర్‌ బాబు తెలిపాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu